Wednesday, January 22, 2025

ఆర్‌టిసి బస్సు ఢీకొని నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆగి ఉన్న లారీని ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లారీ టైరు పంక్చర్ కావడంతో రహదారి పక్కన నిలిపి వేసి మరమ్మతులు చేస్తున్నారు. విశాఖ పట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఆర్‌టిసి బస్సు లారీ మరమ్మతులు చేస్తున్న సిబ్బంది పైకి దూసుకెళ్లడంతో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News