Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృతి…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో గండేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మురారి శివారులో బైక్ అదుపు తప్పి కిందపడిపోయింది. బైక్‌పై నుంచి గుర్తు తెలియని వాహనం వెళ్లడంతో ముగ్గురు అన్నదమ్ములు చనిపోగా తల్లి తీవ్రంగా గాయపడ్డింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బీమవరం మండలం తాడేరు చెందిన నంగల దుర్గ తన ముగ్గురు కుమారులతో కలిసి నర్సీపట్నం వెళ్లి బైక్‌పై సొంత గ్రామానికి తిరిగి వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. వెనుక నుంచి వాహనం వారిపై నుంచి వెళ్లడం ముగ్గురు కుమారుడు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన తల్లిని రాజమహేంద్రవరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రాజు(18), ఏసు(18), అఖిల్(10)గా గుర్తించారు. ఘటనా స్థలంలో సిసి కెమెరాలను పరిశీలిస్తున్నామని సిఐ లక్ష్మణరావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News