Monday, December 23, 2024

ప్రేమ విఫలం… సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమ విఫలం కావడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని సీతంపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కోనసీమ జిల్లాకు చెందిన పి. రామ్ ప్రసాద్ (30) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వైజాగ్‌లో ఓ గణేశ్ నగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి యజమాని సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా మృతుడు సూసైడ్ నోట్‌లో రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సొంతూరు ముమ్మడి వరంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Also Read: రంగు మారిన తుంగభద్ర జలాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News