Monday, December 23, 2024

పాఠశాలలో తేలు కుట్టడంతో తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: పాఠశాలలో తేలు కుట్టడంతో తొమ్మిదో తరగతి విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డా బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోరుమిల్లికి గ్రామానికి చెందిన ప్రసాద్, శ్రీదేవిల దంపతులకు చిన్నకుమారుడు అభిలాష్ తాతయ్య దగ్గర ఉంటూ చదువుకుంటున్నాడు. ప్రసాద్ వరంగల్‌లో కూలీ పనులు చేస్తుండగా కువైట్‌లో తల్లి పని చేస్తుంది. తరగతి గదిలో బెల్లం పట్టీల కాగితాలు ఎక్కువగా ఉండడంతో మరో విద్యార్థితో కలిసి ఏరుతుండగా అభిలాష్ ఏడమ చేతిపై తేలు కుట్టింది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషం ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో రక్తపు వాంతులు కావడంతో విద్యార్థి చనిపోయాడు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News