Thursday, January 23, 2025

గర్భవతిని చేసి పెళ్లి వద్దన్నాడు… పదో తరగతి బాలిక ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: పదో తరగతి బాలికను ప్రియుడు గర్భవతిని చేశాడు, కానీ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెడన మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెడన మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువకుడు, అదే గ్రామానికి చెందిన పదోతరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. బాలికకు రెండు మూడు నెలల నుంచి పీరియడ్స్ రాకపోవడంతో ప్రియుడికి గర్భం దాల్చానని ఆమె చెప్పింది. అబార్షన్ అయ్యేందుకు బాలికకు ప్రియుడు ట్యాబెట్లు ఇచ్చాడు. బాలిక ట్యాబెట్లు వేసుకుంది, కానీ ఆమె బలహీనంగా ఉండడంతో అస్వస్థతకు గురైంది. బాలిక పాఠశాలకు వెళ్లకపోవడంతో తల్లి ఆమెను నిలదీసింది. జరిగిన విషయం చెప్పడంతో తల్లిదండ్రులు ప్రియుడి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని గొడవకు దిగారు. బాలికతో ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాలిక తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు పెడన పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News