Wednesday, January 22, 2025

ఇద్దరు పిల్లలను చంపిన తల్లి… ఆపై ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

అమరావతి: కసాయి తల్లి తన ఇద్దరు కుమారులను నీటి బకెట్‌లో ముంచి చంపి అనంతరం ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… హాల్వి గ్రామంలో రామకృష్ణ-శారద అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు వెంకటేశ్(3), భరత్(06) అనే పిల్లలు ఉన్నారు. శనివార మధ్యాహ్నం శారద తన ఇద్దరు కుమారులను నీటి బకెట్‌లో ముంచడంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. భర్తతో కలిసి వారిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు వారు మృతి చెందినట్టు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాను కుమారులను చంపానని తెలిస్తే ఇంట్లో వారు తనని చంపేస్తారని బయపడి శారద విషం తాగింది. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ నరేంద్ర కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News