Monday, December 23, 2024

మిస్టరీగా ముగ్గురు ట్రాన్స్‌జెండర్ల మృతి

- Advertisement -
- Advertisement -

కర్నూలు: ముగ్గురు ట్రాన్స్‌జెండర్ల మృతదేహాలు చెరువు సమీపంలో కనిపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గార్గేయపురం చెరువు వద్ద రెండు మృతదేహాలు కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. చెరువు ఒడ్డున మరో మృతదేహం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలపై ఎక్కడా గాయాలు లేకపోవడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను గుర్తు పట్టేందుకు కర్నూలులోని వివిధ ప్రాంతాల నుంచి ట్రాన్స్‌జెండర్లను తీసుకొచ్చి విచారిస్తున్నారు. చెరువు వద్దకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా పాయిజన్‌తో ముగ్గురిని హత్య చేసి ఇక్కడ పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News