- Advertisement -
విజయవాడ: తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి కూటమి శాసన సభాపక్ష సమావేశం విజయవాడ-ఏ కన్వెన్షన్ లో ప్రారంభమైంది కూటమి తరఫున గెలుపొందిన ఎంఎల్ఏలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారంతా నారా చంద్రబాబు నాయుడును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు పేరును ప్రతిపాదించారు. చంద్రబాబును కూటమి శాషనసభాపక్ష నేతగా ఎన్నుకున్న ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్ కు పంపబోతున్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కూటమికి ఆహ్వానం పంపనున్నారు. నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు టిడిపి అధినేత ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -