Sunday, December 22, 2024

కూల్ డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగి బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆడుకుంటూ వెళ్లి ఓ బాలుడు కూల్ డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగి చనిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇరుగాళమ్మ కట్టలో షేక్ కరిముల్లా, అమ్ము అనే దంపతులు చికెన్, చేపలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కాలేషా(2), కరిష్మాలు ఉన్నారు. ఆదివారం అమ్ములు ఇరుగాళమ్మ ఆలయం వద్ద పని చేస్తుండగా కాలేషా ఆడుకుంటుంది. పెట్రోల్ బాటిల్ కనిపించగా కూల్ డ్రింక్ అనుకొని తాగింది. వెంటనే కాలేషా కిందపడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది, ఇరుగాళమ్మలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News