Thursday, January 9, 2025

ఆ విషయంలో తల్లిని చంపిన కూతురు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఏకాంతానికి తల్లి అడ్డుగా ఉండడంతో ఆమెను ప్రియుడితో కలిసి కూతురు హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టిఆర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎన్‌టిఆర్ జిల్లా మైలవరం గ్రామంలో జీవమణి అనే యువతి తన తల్లి ఎస్తేర్‌తో కలిసి ఉంటుంది. నాలుగు సంవత్సరాల నుంచి నాగూర్ వలీ అనే యువకుడు పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఈ విషయం తల్లికి తెలియడంతో పలుమార్లు కూతురును యువకుడు మందలించాడు. అక్రమ సంబంధానికి తల్లి అడ్డుగా ఉండడంతో చంపాలని ప్రియుడితో కలిసి కూతురు ప్లాన్ చేసింది. ఎస్తేర్ తలపై జీవమణి, ప్రియుడు సిమెంట్ రాయితో కొట్టి హత్యచేశారు. అనంతరం ప్రియుడు, ప్రియురాలు పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు, ప్రియురాలిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News