Thursday, January 23, 2025

గుడికి తీసుకెళ్తానని… భార్యను చంపేసి లోయలో పడేశాడు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: దంపతుల మధ్య విభేదాల కారణంగా భార్యను గుడికి తీసుకెళ్తానని చెప్పి ఆమె తలపై భర్త బండరాయితో మోది అనంతరం మృతదేహాన్ని లోయలో పడేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టిఆర్ జిల్లా పెనుగ్రంచిప్రోలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తుపాన్ కాలనీలో సురేష్-త్రివేణి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉంది. భర్త భవన కార్మికుడిగా పని చేస్తుండగా భార్య వ్యవసాయ కూలీ పనులకు వెళ్తోంది. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో త్రివేణి స్వగ్రామం నుంచి శింగవరం గ్రామంలో కాపురం పెట్టారు. నాలుగు రోజులు భార్యతో ప్రేమగా వ్యవహరించాడు. భార్యను నమ్మించి మల్లిఖార్జున స్వామని దేవాలయం వెల్దామని చెప్పి భార్యను తన బైక్‌పై భర్త తీసుకెళ్లాడు. సాయంత్రం వరకు తల్లిదండ్రులు ఇంటికి తిరిగిరాకపోవడంతో తాతకు మనవడు, మనవరాలు తెలిపారు.

అనుమానం రావడంతో త్రివేణి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దంపతుల మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సురేష్ నవాబు పేటలో ఉన్నట్టుగా గుర్తించి సోమవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. భార్య కొండకు వెళ్లే ఘాట్ రోడ్డులో తీసుకెళ్లిన తరువాతర బండరాయితో తలపై మోది చంపేసి అనంతరం మృతదేహాన్ని కొండపై నుంచి లోయలో పడేశానని ఒప్పుకున్నాడు. 20 అడుగుల గల లోయలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్తను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News