Wednesday, January 22, 2025

ప్రియురాలిని చంపిన ప్రియుడు….

- Advertisement -
- Advertisement -

అమరావతి: వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలులోని రాజీవ్ గృహకల్ప కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నంద్యాలలో వెంకట్ రెడ్డి, కొండపల్లి గౌరి(32) పదిహేను సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మహేష్ అనే యువకుడితో గౌరికి పరిచయం కావడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యన మందలించాడు. భార్యలో మార్పురాకపోవడంతో వెంకట్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. భర్త చనిపోయిన నాలుగు నెలల తరువాత తన ప్రియుడు మహేష్‌తో కలిసి గౌరి పారిపోయింది. చిన్నకుమార్తెను తీసుకొని మహేష్‌తోనే ఉంటుంది. మహేష్ కూలీ పనులు చేసి ప్రియురాలిని పోషించేవాడు. ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కొంచెం సేపు తరువాత సద్దుమణిగింది. శనివారం ఉదయం గౌరి ఉంటున్న ఇంట్లో నుంచి ఏడుపులు వినిపించడంతో స్థానికులు డోర్ ఓపెన్ చూడగా గౌర విగతజీవిగా కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గౌరి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేస్తామని సిఐ భక్తవ్సల రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News