Friday, December 20, 2024

పల్నాడులో మద్యం తాగించి బాలికలపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

అమరావతి: బాలికలకు కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి తాగించి అనంతరం వారిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక, 17 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు శారీరకంగా కలిశారు. సదరు యువకుడు బాలికకు పలు వ్యసనాలను అలవాటు చేశాడు. యువకుడికి మరో స్నేహితుడు ఉన్నాడు. అతడు గోతాల దుకాణంలో పని చేస్తున్నాడు.

ఆరో తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి కొటప్పకొండ రోడ్డులోని ఓ రూమ్‌కు ఇద్దరు బాలికలను తీసుకెళ్లారు. కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి తాగించారు. అనంతరం బాలికలపై ఇద్దరు అత్యాచారం చేసి బంధించారు. ఆడుకుంటామని చెప్పి బయటకు వెళ్లిన కూతుళ్లు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్ద గాలించారు. ఒక యువకుడు అనుమానంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వెలుగులోకి వచ్చింది. రూమ్‌లో బంధించిన బాలికలను పోలీసులు బయటకు తీసుకొచ్చారు. బాలికలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. తల్లిదండ్రులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మీడియా మిత్రులు వివరణ అడగగా పోలీసులు మాత్రం స్పందించడంలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News