అమరావతి: ఎపిలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం ముగిసింది. క్యూలైన్ లో ఉన్నవారికి సాయంత్రం వరకు ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2.30 వరకు 78.9శాతం పోలింగ్ నమోదైంది. విజయనగరంలో అత్యధికంగా 85.60శాతం పోలింగ్ నమోదైంది. నెల్లూరులో అత్యల్పంగా 73.20 పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళంలో 78.81 శాతం , విజయనగరంలో 85.60శాతం, విశాఖలో 84.07 శాతం, తూ.గో జిల్లాలో 74.99శాతం, ప.గో జిల్లాలో 79.03శాతం, కృష్ణలో 79.29శాతం, గుంటూరులో 76.74 శాతం, ప్రకాశంలో 78.77శాతం, నెల్లూరులో 73.20శాతం, చిత్తూరులో 75.68శాతం, కడపలో 80.68 శాతం పోలింగ్ నమోదైంది.
ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్…
ఎపిలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. తుదివిడుతలో 13 జిల్లాల్లోని 161 మండలాల్లో 2,743 పంచాయతీలు,22,423 వార్డులకు కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటికే 553 పంచాయతీలు, 10,921 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. సర్పంచ్ బరిలో 7,475 మంది, వార్డు స్థానాలకు 49,089 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Andhra Pradesh Panchayat Election 2021