Sunday, December 22, 2024

ప్రియురాలి కుమారుడిని గొడ్డలితో ముక్కలుగా నరికి….

- Advertisement -
- Advertisement -

అమరావతి: డబ్బుల విషయంలో గొడవ జరగడంతో ప్రియురాలి కుమారుడిని గొడ్డలితో ముక్కలుగా నరికి రెండు సంచుల్లో ప్యాక్ చేశాడు. అనంతరం రెండు సంచులను బైక్‌కు పై పెట్టుకొని గ్రామ శివారులో పడేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నాగరత్నమ్మ అనే మహిళ తన భర్త 20 సంవత్సరాల క్రితం చనిపోవడంతో తన కుమారుడు మహేశ్వర్ రెడ్డి(30)తో కలిసి ఉంటుంది. భూమిరెడ్డి రామచంద్రారెడ్డి పరిచయం కావడంతో ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. మహేశ్వర్ రెడ్డి భారతి సిమెంట్ పరిశ్రమలో పని చేస్తుండగా రామచంద్రారెడ్డి స్వీట్స్ తయారీతో పాటు క్యాటరింగ్ చేస్తున్నాడు. ఇద్దరు మధ్య డబ్బుల విషయం గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో ఇద్దరు కలిసి మద్యం తాగారు అనంతరం డబ్బుల విషయంలో గొడవ జరిగింది. నాగరత్నమ్మ అనారోగ్య సమస్యలు ఉండడంతో మత్తు ఇంజక్షన్ వేసుకొని పడుకుంది. మరో గదిలో మహేశ్వర్ రెడ్డి పడుకున్నాడు. రామచంద్రారెడ్డి గొడ్డలి తీసుకొని మహేశ్వర్ రెడ్డి రెండు ముక్కలుగా నరికాడు అనంతరం శరీర భాగాలను రెండు సంచుల్లో మూట కట్టాడు. రెండు సంచులను బైక్‌పై పెట్టుకొని గ్రామ శివారులో పడేశాడు.

అనంతరం రత్నమ్మకు టిఫిన్ ఇచ్చి బయటకు వెళ్లాడు. రత్నమ్మ ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గొడ్డలి, కత్తి, కొన్ని శరీర భాగాలను గుర్తించారు. మరికొన్ని శరీర భాగాలు కనిపించకపోవడంతో గ్రామ శివారులో వెతికారు. రామచంద్రారెడ్డి బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. సంచులు ఎక్కడ పడేసిన విషయం తెలియకపోవడంతో డాగ్ స్వ్కాడ్ సహాయంతో చిన్నశెట్టిపల్లెరోడ్డులోని మైలవరం ఉత్తర కాలువ వద్ద శరీర భాగాలను గుర్తించారు. వెంటనే వాటిని శవ పరీక్ష నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామచంద్రారెడ్డి పరారీలో ఉండడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News