- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 93,759 కరోనా పరీక్షలు చేయగా 3,464 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 35 మంది కరోనాతో మరణించారు. అదే సమయంలో 4,284 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37,323 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్రలో ఇప్పటివరకు 18,96,818 మందికి కరోనా సోకగా, 18,46,716 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. తాజా మరణాలతో కలిపి ఆంధ్రప్రదేశ్ లో కరోనా మృతుల సంఖ్య 12,779కి చేరింది. తూర్పు గోదావరి జిల్లాలో అధికంగా 667 కొత్త కేసులు రికార్డు అయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 78 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
Andhra Pradesh reported 3464 new Covid-19 cases
- Advertisement -