Friday, November 22, 2024

ఎపిలో మరో 11,303 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

Andhra Pradesh reports 11303 new Covid-19 cases

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 93,704 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 11,303 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా 104 మంది మృతిచెందారు. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుని 18,257 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,04,388కి పెరిగింది ఆంధ్రలో ప్రస్తుతం 1,46,737 యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ్ వల్ల పశ్చిమ గోదావరిలో ఇరవై మంది, చిత్తూరులో పద్నాలుగు మంది, అనంతపూర్, గుంటూర్లలో తొమ్మిది, తూర్పు గోదావరిలో ఎనిమిది, విశాఖపట్నంలో ఏడుగురు, కృష్ణ, కర్నూల్, శ్రీకాకుళం, విజయనగరంలో ఆరుగురు, కడపలో ఐదుగురు, నెల్లూరు, ప్రకాశంలో నలుగురు మరణించారు. నేటి వరకు రాష్ట్రంలో 1,93,50,008 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News