హైదరాబాద్ : ఎపిలో రోజురోజుకూ కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,872 కరోనా కేసులు నమోదు కాగా కరోనా వైరస్‌తో 86 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 17,63,211కి కరోనా కేసులు చేరగా, మొత్తం 11,552 మంది మరణించారు. రాష్ట్రంలో 1,14,510 యాక్టివ్ కేసులు ఉండగా, 16,37,149 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో 24 గంటల్లో 13,702 మంది రికవరీ అయ్యారు. 24 గంటల్లో 64,800 టెస్టుల నిర్వహించారు. కొత్తగా చిత్తూరు జిల్లాలో 13 మంది మృతి చెందగా, గుంటూరు జిల్లాలో 10 మంది, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో 9 మంది, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏడుగురు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఆరుగురు, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. కొత్తగా నెల్లూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు.
ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు
ఎపి ప్రభుత్వం మరోసారి కర్ఫ్యూను పొడిగించింది. ప్రస్తుతం అమలవుతున్న కర్ఫూలో స్వల్ప మార్పులు చేస్తూ జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగించారు. అయితే జూన్10 తర్వాత ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూ సమయంలో సడలింపు చేసారు. ఇక ప్రభుత్వ కార్యాలయాల పనిదినాల్లో ఉ.8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు నడవనున్నాయి.
Andhra Pradesh reports 4,872 new COVID cases, 13,702 recoveries, and 86 deaths in the past 24 hours
Active cases: 1,14,510
Total recoveries: 16,37,149
Death toll: 11,552 pic.twitter.com/gJ9geX8Xpy— ANI (@ANI) June 7, 2021