Monday, December 23, 2024

కెసిఆర్ నాయకత్వంలో సువర్ణాంధ్ర సాకారం: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: సిఎం కెసిఆర్ నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశం సాకారమవుతుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. రాయల తెలంగాణ అంశంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. రాయల తెలంగాణ అంశం వదిలి ఆ దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. అక్కడ ప్రభుత్వాల వైఫల్యాలతోనే రాయల తెలంగాణ అంశం తెర మీదకు వచ్చిందన్నారు. ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదన్నారు. రాయల తెలంగాణ కోరడం తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోవడమే కారణమన్నారు.

Also Read: నోరు విప్పిన నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య ఆలియా!

తెలంగాణలో కలపాలని తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కోరడం కెసిఆర్ అభివృద్ధికి నిదర్శనమని ప్రశంసించారు. తెలంగాణలో కలపండి లేకపోతే మా దగ్గరికి రండి అని సిఎం కెసిఆర్ ఆహ్వానిస్తున్నారన్నారు. తెలంగాణ బంగారు తెలంగాణగా మారినట్టి సువర్ణాంధ్ర నిర్మాణం సాధ్యమని గతంలోనే చెప్పారని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. పరిపాలకుల చిత్తుశుద్ధి లోపంతో ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయని, పరిపాలకులను మార్చడంతోనే సువర్ణాంధ్రగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు.  కెసిఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, వెనుకబాటుకు కారణమైన పారిపాలకుల మీద ఆంధ్ర ప్రజలు తిరుగుబాటు చేయాలన్నారు. అభివృద్ధి సాధించే నాయకత్వాన్ని ఎన్నుకునే దిశగా ఆంధ్ర ప్రజలు నాయకులు ఆలోచించాలని జగదీష్ రెడ్డి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News