- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం అసంబద్ధమైనదని, సుప్రీంకోర్టులో కేసు ఉందన్నారు. కుదిరితే మళ్లీ తెలంగాణ, ఎపి ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే వైసిపి విధానమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి పోరాటం చేస్తుంది వైసిపినేనని పేర్కొన్నారు. అప్పట్లో టిడిపి, కాంగ్రెస్, బిజెపి విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని మండిపడ్డారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే తొలుత స్వాగతించేది వైసిపినేనని, విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో తమ వాదనలు బలంగా వినిపిస్తామన్నారు. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలని, లేకపోతే సరిదిద్దాలని కోరుతామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలన్నదే ఇప్పటికీ తమ విధానమని, రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే న్యాయస్థానంలో కేసులు వేశామన్నారు.
- Advertisement -