Monday, December 23, 2024

భార్యను పుట్టింటికి తీసుకెళ్తానని చెప్పి… రోడ్డుపైనే ఆమె గొంతు కోసి

- Advertisement -
- Advertisement -

అమరావతి: భార్యపై అనుమానంతో ఆమె గొంతు కోసి భర్త పారిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి అర్బన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కురుమాల గ్రామానికి చెందిన అనిత వరసకు మేనమామ రామాంజనేయులను ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భార్యను భర్త అనుమానించడంతో పలుమార్లు గొడవలు జరిగాయి. ఘర్షణ జరగగానే ప్రతీసారి అనిత తను పుట్టింటికి వెళ్లిపోయేది. 20 రోజుల క్రితం ఇద్దరు మధ్య గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో పెద్దలు నచ్చచెప్పడంతో మళ్లీ అత్తగారింటికి వచ్చింది.

గురువారం ఇద్దరు మధ్య గొడవ జరగడంతో ఆమెను పుట్టింటి వెళ్తానని అతడికి ఆమె చెప్పింది. దీంతో తానే భార్యను తీసుకెళ్తానని అతడు ఆమెను నమ్మించారు. కురుమాలకు తీసుకెళ్తానని చెప్పి బైక్‌పై తీసుకెళ్తుండగా దిగువచెర్లోపల్లి శివారులోకి రాగానే బైక్‌ను అటవీ ప్రాంతం వైపు తీసుకెళ్లాడు. భార్యను అడవిలోకి లాక్కెళ్లి కత్తితో గొంతు కోశాడు. ఆమె కేకలు వేయడంతో వాహనదారులు వెంటనే స్పందించారు. బైక్‌ను అక్కడే వదిలేసి భర్త పారిపోయాడు. ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News