Wednesday, December 25, 2024

ప్రియురాలితో చనువుగా ఉంటున్నాడని ఇద్దరిని నరికి చంపిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: తన ప్రియురాలికి మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను, మరో వ్యక్తిని ప్రియుడు నరికి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కోదడ్డపనస గ్రామంలో వెలమల ఎర్రమ్మ అనే వివాహితకు ముద్దాడ రామారావు అనే ప్రియుడు ఉన్నాడు. గత కొంత కాలంగా ముద్దాడ సంతోష్ కుమార్‌తో చనువుగా ఉండడం రామారావు గమనించాడు. ఈ విషయంలో రామారావు, ఎర్రమ్మ మధ్య గొడవలు జరిగాయి. కోద్దడపనస గ్రామ శివారులో వంశధార నదిలో సంతోష్ కుమార్ స్నానం చేస్తుండగా రామారావు అక్కడికి వెళ్లి నరికి చంపాను. అనంతరం బైక్‌పై ఎర్రమ్మ పని చేస్తున్న చేనుకు వెళ్లాడు. ఆమె వెంట పడి మరి ఆమెను నరికి చంపాడు. అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: హైదరాబాద్ లో నీడ పోయింది.. రెండు నిమిషాలు జీరో షాడో!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News