Monday, January 13, 2025

కాలువలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: కారు కాలువలో దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో విశాఖఫట్నం నుంచి పి గన్నవరంలోని పోతవరం వెళ్తున్నాడు. ఊడిమూడి శివారులోని చింతావారి పేట గ్రామ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భార్య, ఇద్దరు పిల్లలు మృతి చెందగా భర్త తప్పించుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున మహిళ డ్రైవింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News