Friday, December 27, 2024

ప్రేమపెళ్లి… ప్రేయసి రావడంలేదని పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తరువాత ప్రేయసి తనతో రాకపోవడంతో భగ్న ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో వాసుదత్త అనే యువకుడు, ఓ యువతి గాఢంగా ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అడ్డుచెప్పడంతో పెన్నఅహోబిలంలో యువతి, యువకుడి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. యువతి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో యువతి, యువకుడిని పిఎస్‌కు పోలీసులు తీసుకొచ్చారు. పోలీసుల ఎదుట వాసుదత్త తని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పడంతో ఆమెను తల్లిదండ్రులతో పంపించారు. మనస్థాపం చెందిన వాసుదత్త అనంతపురం జిల్లా కేంద్రంలోని కళ్యాదదుర్గం రోడ్డు సమీపంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వాసుదత్త మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News