Monday, November 18, 2024

ప్రేమ పేరుతో వేధింపులు…. యువతి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమ పేరు వేధింపులకు గురిచేయడంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో జరిగింది. నగరూరులో ఇంటర్ విద్యార్థినిని ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధించాడు. వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News