Sunday, December 22, 2024

భూవివాదం… ట్రాక్టర్‌తో ఢీకొట్టి దళిత మహిళ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆదోని మండలంలో భూ వివాదంలో ఓ దళిత మహిళను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. నాగనాథణహళ్లి గ్రామంలో గుండమ్మ(49), రాఘప్ప రెడ్డికి గత కొన్ని రోజులు భూవివాదం నడుస్తోంది. గుండమ్మ, రాఘప్పరెడ్డి ఇద్దరు భూమి వద్దకు రావడంతో వారి మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో గుండమ్మను రాఘప్పరెడ్డి తన కుమారుడు శ్రీధర్ రెడ్డితో కలిసి ట్రాక్టర్‌తో ఆమెను ఢీకొట్టి హత్య చేశాడు. గుండమ్మ తరపున భూపంచాయతీకి వెళ్లిన పురుషోత్తమ్ రెడ్డిపై కర్రలతో దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News