అమరావతి: గాఢంగా ప్రేమించాడు పెళ్లి చేసుకోమ్మని బలవంతం చేయడంతో ప్రియురాలిని ప్రియుడు గొంతు నులిమి చంపి అనంతరం చెట్టుకు ఉరేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దత్తవలస గ్రామానికి చెందిన పెరుమాళ్ల రాంబాబు ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాంబాబుకు భార్య పిల్లలు ఉన్నారు. మర్రివానివలస గ్రామానికి చెందిన ఐశ్వర్య(20) ఓ బట్టల దుకాణంలో పని చేసేది. ఐశ్వర్యకు రాంబాబు పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. పలుమార్లు పెళ్లి చేసుకోవాలని రాంబాబును ఐశ్వర్య నిలదీసింది. మార్చి 27న ఇద్దరు కలిసి విశాఖపట్నంలోని ఆరిలోవకు వెళ్లారు. పెళ్లి చేసుకోవాలని రాంబాబును ఐశ్యర్య నిలదీయడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరడంతో గొంతుకు తాడి బిగించి ప్రియురాలిని ప్రియుడు చంపేశాడు.
అనంతరం 108కి ఫోన్ చేసి ప్రేవేటు ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలపడంతో అక్కడి నుంచి బైక్‌పై మృతదేహాన్ని స్నేహితుడు సాయంతో తీసుకెళ్లాడు. 105 కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత చీపురువలసకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. బైక్‌లో పెట్రోలో అయిపోవడంతో మరో స్నేహితుడు పెట్రోల్ తీసుకొచ్చాడు. ముగ్గురు కలిసి ఓ జీడి తోటలో ఆమెకు ఉరి బిగించి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించారు. యువతి చెట్టుకు వేలాడుతుండడంతో చీపురవలస గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా రాంబాబును అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.