Wednesday, January 22, 2025

మట్టి మిద్దె కూలి నలుగురు సజీవ సమాధి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలో చిన్నవంగలిలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున మట్టి మిద్దెకూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం చెందారు. మిద్దెకూలిన వెంటనే గ్రామస్థులు అప్రమత్తమై శిథిలాల కింద ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. కూలిపోయిన ఇంట్లో గురుశేఖర్ రెడ్డి- దస్తగిరిమ్మ అనే దంపతులు తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో మిద్దె కూలి  ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్ల నుంచి ప్రజలను బయటకు తీసుకొచ్చి పునరావస చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లను కూలగొట్టి ప్రభుత్వం కొత్త ఇండ్లను నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News