Monday, January 20, 2025

బాలికపై గ్యాంగ్ రేప్…. కాలువలోకి నెట్టేశారు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు బాలర్లు అత్యాాచారం చేసి అనంతరం ఆమెను కాలువలోకి నెట్టేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పగిడ్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఆదివారం సాయంత్రం ఒంటరిగా బాలిక ఆడుకుంటుండగా ముగ్గురు బాలుర్లు బలవంతంగా ఆమెను గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. ఆమెపై ముగ్గురు అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు చెబుతుందని భయపడి వెంటనే బాలికను అక్కడ కాలువలోకి నెట్టేసి అక్కడి నుంచి వారు పారిపోయారు. సాయంత్రం కూతురు కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వెతికారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసు జాగిలం ముచ్చుమర్రి ప్రాంతం నుంచి కాలువ వద్దకు వచ్చి ఆగిపోయింది. ఒక బాలురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే అత్యాచారం చేసి కాలువలోకి నెట్టేసినట్టు ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మిగితా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేప్టటారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News