Sunday, December 22, 2024

ఫోన్‌ కాల్‌ తెచ్చిన తంటా… భార్యను వేటకత్తితో నరికి చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

అమరావతి: అనుమానం పెనుభూతంగా మారి భార్య రోజు ఫోన్‌లో మాట్లాడుతోందనే అనుమానంతో ఆమెను భర్త కత్తితో నరికి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రామానుజపురం గ్రామంలో సూర్యచంద్రం, సాయి లక్ష్మి అనే దంపతులు నివసిస్తున్నారు. భర్త ఇంట్లో లేనప్పుడు భార్య గంటల గంటలు ఫోన్లో మాట్లాడుతుండడం అతడు పలుమార్లు గమనించాడు. సాయి లక్ష్మి తన పుట్టింటి కుటుంబ సభ్యులతో కాకుండా మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. వేరే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుండగా సూర్యచంద్రం గమనించాడు. ఇంట్లో ఉన్న వేట కత్తి తీసుకోని భార్యపై దాడి చేశాడు. భార్యను హత్య చేసిన తరువాత కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్‌లో అతడు లొంగిపోయాడు. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News