Sunday, December 22, 2024

అమ్మను మంచిగా చూసుకో అన్నా… నేను చనిపోతున్నా: తమ్ముడు సూసైడ్ లెటర్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ‘అన్నా నాకు బతకాలని లేదు, నేను చనిపోతున్నా, ఏ పని చేయలేకపోతున్నా, అమ్మను మంచిగా చూసుకో’ అని అనారోగ్య సమస్యలతో సోదరుడికి లేఖ రాసి తమ్ముడు అత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా వై పాలెం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గోళ్లవిడిపి గ్రామంలో పోలు అచ్చేశ్వరరావు (20) తన తల్లి, ముగ్గురు సోదరులతో కలిసి ఉంటున్నాడు. ముగ్గురు సోదరులు బతుకుదెరువు కోసం వలస పోయారు. అచ్చేశ్వరరావు డిగ్రీ చదువుతుండగా ఆర్థిక సమస్యలు తలెత్తడంతో చదువును మధ్యలో ఆపేశాడు. అచ్చేశ్వరరావు అనారోగ్య సమస్యలు రావడంతో పాటు గత కొంతకాలంగా కడుపు నొప్పి వస్తే చికిత్స చేయించుకున్నాడు. గురువారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కడుపునొప్పి రావడంతో బాధను భరించలేకపోయాడు. అమ్మను మంచిగా చూసుకోవాలని, తాను ఏ పని చేయలేకపోతున్నానని సూసైడ్ లేఖ రాసి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. గ్రామస్థులు గమనించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News