Saturday, February 22, 2025

గామన్ వంతెనపై బోల్తాపడిన ట్రావెల్స్ బస్సు…. తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి గామన్ వంతెనపై ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వి కావేరి ట్రావెల్స్ బస్సు(ఎన్‌ఎల్ 01బి2987) విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్షంతో పాటు మద్యం మత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతురాలు హోమిని(21) తన సోదరి ధనలక్ష్మితో కలిసి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఇంటర్వూకు వెళ్తున్నట్టు సమాచారం. పోలీసులు క్రేన్ సహాయంతో బస్సు పక్కకు తొలగించారు. బస్సు కొంచెం ముందుకు వెళ్లి బోల్తాపడి ఉంటే గోదావరి నదిలో పడేదని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News