అమరావతి: ప్రియుడ్ని ప్రియురాలు భర్త తన తండ్రితో కలిసి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బావాయిపాలేం గ్రామంలో మజ్జి ఏసురాజు(28) అనే యువకుడు నివసిస్తున్నాడు. ఏసురాజు అదే గ్రామంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రియురాలు భర్త పలుమార్లు ఏసురాజును హెచ్చరించాడు. తన భార్యతో వివాహేతర సంబంధం వదులుకోవాలని సూచించాడు. ఏసురాజు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అంతం మొందించాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఉండి మండలంలోని సదరు మహిళ తన పుట్టింటికి వెళ్లింది. ఏసురాజు ఆమె ఇంటికి ఏకాంతంగా ఉన్నప్పుడు భర్త అక్కడికి చేరుకున్నాడు. ఏసురాజు కనిపించడంతో తన తండ్రికి సమాచారం ఇచ్చాడు. ఇద్దరు మరొకరుతో కలిసి ఏసురాజును బావాయిపాలెం తీసుకొచ్చారు. ఆమె సందేశాలు పంపుతున్న ఏసురాజు కుడి చేయిని కత్తితో నరికేశారు. అనంతరం గ్రామ శివారులో పడేసి వెళ్లిపోయారు. రక్త స్రావం ఎక్కువ కావడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.