Sunday, December 22, 2024

అన్న కుటుంబ సభ్యులను చంపేసి… సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇంట్లోనే అన్నతో తమ్ముడు మద్యం తాగి అనంతరం వదిన, అన్న కూతుళ్లను చంపాడు. తరువాత మరిది ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పద్మానగర్ లో టిపి దాస్ అనే వ్యక్తి తన భార్య సునీత(40), ఇద్దరు కూతుళ్లు దేవ శ్రీ(13), నీరజ(10)తో కలిసి ఉంటున్నాడు. దాసు తమ్ముడు మోహన్(35) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మోహన్ మొదటి భార్యతో విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకున్నాడు. మోహన్, రెండో భార్యకు మధ్య గొడవలు జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మోహన్ మానసికంగా కుంగిపోయాడు.

బుధవానం దాస్ ఇంట్లో అన్నతో కలిసి తమ్ముడు మద్యం తాగాడు. అనంతరం పని ఉండడంతో దాస్ బయటకు వెళ్లిపోయాడు. అదే సమయంలో అన్న కూతుళ్లు ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చారు. వదిన, కూతుళ్లను చంపి అనంతరం మోహన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దాస్ ఇంటికి వచ్చిన తరువాత ఇంటి లోపల నుంచి గడియపెట్టి ఉండడంతో బలవంతంగా ఓపెన్ చేశారు. భార్య, ఇద్దరు కూతుళ్లు రక్తపు మడుగులో కనిపించిగా తమ్ముడు ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News