Sunday, April 13, 2025

దళితుడిని ప్రేమించిందని…. కూతురు ప్రాణం తీసి… తగలబెట్టిన తల్లి

- Advertisement -
- Advertisement -

అమరావతి: దళిత యువతికుడిని ప్రేమిస్తుందని, అతడిని పోక్సో చట్టం కింద జైలుకు పంపించింది. జైలు నుంచి విడుదలైన తరువాత అతడితో తిరుగుతుందని బాలికను కన్నతల్లి చంపింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో జరిగింది. చంద్రగిరి మండలంలోని ఓ గ్రామంలో బాలిక(16), తల్లితో కలిసి ఉంటుంది. ఆమె తల్లిదండ్రుల మధ్య గొడవలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. సదురు బాలిక దళిత యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడితో తిరగవద్దని పలుమార్లు కూతురిని తల్లి హెచ్చరించింది. మళ్లీ ఇద్దరు కలిసి తిరగడంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దళిత యువకుడిని జైలుకు పంపారు. జైలులో ఉండగానే ప్రియుడ్ని రెండు సార్లు బాలిక కలిసింది. జైలు నుంచి విడుదలైన తరువాత బాలిక సదరు యువకుడితో కలిసి తిరగడంతో మేనమామ, అమ్మమ్మ సర్ది చెప్పడానికి ప్రయత్నించారు.

బాలిక ప్రెగ్నెంట్ కావడంతో అబార్షన్ కూడా చేయించింది. బాలిక వినకపోవడంతో బాలిక తండ్రికి ఆమె తల్లి విషయం చెప్పింది. వారం రోజుల క్రితం కూతురు ఫోన్ తీసుకొని బయటకు వెళ్తుండగా వద్దని వారించింది. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో పెనుగులాట జరిగింది. కుమార్తె వెళ్తుండగా వెనుక నుంచి నోరు మూసి మెడ పట్టుకొని కిందకు పడేసింది. బాలిక ఆచేతనంగా పడిపోవడంతో చనిపోయిందని తల్లి నిర్ధారించుకుంది. కూతురు మృతదేహాన్ని ఇంట్లోనే తాళం వేసి పారిశుద్ద కార్మికురాలిగా పని చేస్తున్న తిరుమలకు వెళ్లిపోయింది. మరుసటి రోజు భర్తకు ఫోన్ చేసి కూతురును పాఠశాలక పంపించాలని కోరింది. అతడు ఇంటికి వెళ్లి చూడగా కూతురు చనిపోయి కనిపించడంతో ఆందోళనకు గురయ్యాడు. వెంటనే బంధువులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి గ్రామ శివారులో ఎవరికీ తెలియకుండా దహనం చేశారు. ఈ విషయం నాలుగు రోజుల తరువాత వెలుగులోకి రావడంతో జిలా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేయాలని ఎస్‌ఐ, సిఐకి ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకుంది. ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News