Sunday, December 22, 2024

అక్రమ సంబంధం… వదిన గొంతుకోసి… మరిది ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

అమరావతి: వదినతో మరిది వివాహేతర సంబంధం పెట్టుకొని, ఆమె అతడిని దూరంగా ఉంచడంతో కోపంతో ఆమె గొంతుకోసి అనంతరం తాను గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దుర్గ అనే వివాహిత(36) తన భర్తతో గొడవలు రావడంతో వేరుగా ఉంటుంది. దుర్గు తన ముగ్గురు పిల్లలతో కలిసి పద్మజానగర్‌లో ఉంటుంది. దుర్గ రైతు బజారులో స్వీపర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. దుర్గు చెల్లెలు భర్త హరితో పరిచయం కావడంతో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలో హరి తన భార్యతో గొడవ పడి దూరంగా ఉంటున్నాడు. తన చెల్లెలుతో విడిగా ఉన్నప్పటికి మరిది వదిన వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

అక్రమం సంబంధం విషయం దుర్గం కుమారుడికి తెలియడంతో పలుమార్లు హరిని బెదిరించడమే కాకుండా బాబాయ్ పై దాడి చేశాడు. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో హరిని దుర్గా దూరంగా పెడుతూ వచ్చింది. రోజు రోజుకు దూరంగా పెరుగుతుండడంతో ఆమెపై పగ పెంచుకొని హత్య చేయాలని ప్రణాళిక వేశాడు. ప్లాన్‌లో భాగంగా ఎవరు లేని సమయంలో వదిన ఇంటికి వెళ్లి ఆమె గొంతు కోశాడు. అనంతరం అతడు గొంతు కోసుకొని రోడ్డుపైకి వచ్చి పడ్డాడు. వెంటనే స్థానికులు స్పందించి ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వదిన మార్గం మధ్యలో మృతి చెందగా మరిది కోన ఊపిరితో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News