Tuesday, April 1, 2025

సోషల్ మీడియాలో అమ్మాయిగా పరిచయం చేసుకొని… వేధింపులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: అందమైన అమ్మాయి పేరుతో ఇన్ స్టా గ్రామ్ ఖాతాను ఓ యువకుడు ఓపెన్ చేశాడు. పదో తరగతి బాలికతో ఇన్ స్టాగ్రామ్ లో స్నేహం చేశాడు. నగ్నంగా ఉన్న వీడియోలను సేకరించి బాలికను బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మాచవరంలోని ఓ గ్రామంలో బాలిక పదో తరగతి చదువుతోంది. సదరు బాలిక ఇన్ స్టాగ్రామ్ లో అమ్మాయి పేరుతో రిక్వెస్ట్ రావడంతో చాటింగ్ చేసింది. ఇద్దరు మంచి స్నేహితులు మారారు. కొన్ని రోజుల తరువాత వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. బాలికకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసుకుంది. బాలికకు బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోలను సదరు అమ్మాయికి షేర్ చేసింది. అప్పటి నుంచి సదరు బాలికను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.

నగ్న వీడియోలు చిత్రాలను పంపించి డబ్బులు పంపాలని డిమాండ్ చేసింది. తలి ఫోన్ నుంచి ఐదు వేల రూపాయలు పంపించిన తరువాత కూడా వేధింపులకు పాల్పడ్డాడు. నగ్నం వీడియోలు బాలిక తల్లి ఫోన్ కు పంపించడంతో ఆమె షాక్ కు గురైంది. వెంటనే మాచవరం పోలీస్ స్టేషన్ తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి మెదక్ జిల్లాకు చెందిన ఎం రాబర్ట్(23) అలియాస్ అఖిల్ గా గుర్తించారు. అఖిల్ పదో తరగతి చదివి హైదరాబాద్ లో టి మాస్టర్ గా పని చేస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్ అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టుకొని మోసం చేయడమే అతడు లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News