Monday, December 23, 2024

విశాఖలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ దళిత బాలికపై పది మంది అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒడిశాకు చెందిన ఓ కుటుంబంలో కంచరపాలెంలో జీవిస్తోంది. రైల్వే న్యూకాలనీలో ఓ ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పనికి కుదిరింది. ప్రేమ పేరుతో మాయమాటలతో ఓ యువకుడు ఆమెను లాడ్జ్‌కు తీసుకెళ్లాడు. కామవాంఛ తీర్చుకున్న తరువాత అతడి స్నేహితుడికి సమాచారం ఇచ్చాడు. స్నేహితుడు లాడ్జ్‌కు చేరుకొని ఆమెపై అత్యాచారం చేశాడు. బాధను గుండెలో దాచుకొని ఆత్మహత్య చేసుకొని విశాఖ బీచ్‌కు చేరుకుంది. అక్కడ ఉన్న ఫొటో గ్రాఫర్ ఆమెను లాడ్జ్‌కు తీసుకెళ్లాడు, తన పది మంది స్నేహితులతో రెండు రోజులు పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. బాలిక వారి నుంచి తప్పించుకొని ఒడిశాకు వెళ్లిపోయింది. తన కూతురు కనిపించడంలేదని నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలికను గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. మానసిక భయాందోళనతో ఆమెపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులతో పంచుకోలేకపోయింది. ఆదివారం జరిగిన విషయం చెప్పడంతో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ప్రియుడి, అతడి స్నేహితుడు పరారీలో ఉన్నారు.ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News