Monday, December 23, 2024

ప్రేమ పెళ్లి… యువతి ప్రాణం తీసిన రహదారి గుంత

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సంతోషంగా ఉన్న సమయంలో రహదారి గుంత నవ వధువు పాలిట శాపంగా మారింది. పది కాలాల పాటు సంసారం పచ్చగా సాగాలని ఆశీర్వదించిన దేవుడు ఆ జంటపై కన్నెర్ర జేశాడు. ముచ్చటగా సంసారం చేసుకునేందుకు మూడు ముళ్ల ప్రేమ బంధంతో ఒక్కటైన ఆ జంటను విడదీశాడు. భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు గుంతలో పడి భార్య చనిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పినగాడి-వేపగుంట రహదారిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుల్లెపల్లికి చెందిన సంతోషి(23), ఆర్‌ఆర్ వెంకటాపురానికి చెందిన వెంకట అప్పారావును పెళ్లి చేసుకున్నారు. నాలుగు నెలల క్రితం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. గురువారం దంపతులు గుల్లెపలి వెళ్లారు. రాత్రి పదిన్నర్ పినగాడి మీదుగా తిరిగి వస్తుండగా మీనాక్షి కల్యాణ మండప సమీపంలో రోడ్డు గుంతలో నుంచి బైక్ వెళ్లడంతో కింద పడ్డారు. సంతోషి తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కెజిహెచ్‌లో చికిత్స పొందుతూ సంతోషి మృతి చెందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News