Monday, December 23, 2024

ప్రేమికుడి నయవంచన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొనఊపిరితో

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు…. చివరి నిమిషంలో ప్రియుడు పెళ్లి చేసుకోవడంతో జాప్యం చేయడంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో ఆస్పత్రి పాలైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వాసిరెడ్డి శేఖర్ ప్రేమించానని రత్న మాధురి(26) వెంట పడ్డాడు. దీంతో అతడి మాయమాటలకు నమ్మి అతడితో మాధురి ప్రేమయాణం కొనసాగించింది. శేఖర్- మాధురి అనే జంట గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మాధురి కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాలని శేఖర్‌ను పలుమార్లు కోరినా కూడా స్పందించలేదు. కాలయాపన చేస్తుండడంతో వాడు మోసం చేశాడని మాధురి తెలుసుకుంది. జనవరి 27న మాధురి శేఖర్‌తో కలిసి విశాఖపట్నం వెళ్లింది. అదే రాత్రి ఆమెను శేఖర్ ఇంటి వద్ద దించి వెళ్లిపోయాడు. మార్నాడు నుంచి ఆమె తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో విశాఖలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటి ఇప్పటివరకు ఆమె కోలుకోలేదు. దీంతో ప్రియురాలు బంధువులు శేఖర్‌ను నిలదీశారు. తన కూతురుపై విషప్రయోగం జరిగి ఉండొచ్చని తల్లి అమ్మాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News