Sunday, December 22, 2024

బెడ్ పై మరో మహిళతో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: వేరే మహిళతో భర్తను బెడ్‌పై రెడ్ హ్యాండెడ్‌గా భార్య పట్టుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ యువతి, యువకుడు గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రేమ జంట చాలా సంతోషంగా జీవితం గడుపుతున్న సమయంలో భర్తకు మరో మహిళతో పరిచయమైంది. ఇద్దరు పరిచయం అక్రమ సంబంధానికి దారితీయడంతో ఎక్కువగా ఆమెతోనే గడుపుతున్నాడు. ఇది గమనించిన భార్య భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయం తీసుకుంది. భర్త తన ప్రియురాలితో కలిసి లాడ్జ్‌కు వెళ్లడం భార్య గమనించి అనుసరించింది. వెంటనే బంధువులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఇద్దరు లాడ్జ్ రూమ్‌లో బెడ్‌పై ఉండగా భార్య, బంధువులు వారిని పట్టుకున్నారు. ఇద్దరిపై దాడి చేసి పోలీసులకు పట్టించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News