Wednesday, April 2, 2025

ప్రియుడిపై కోపం… ప్రియురాలు ఆ పని చేసిందంటే షాక్ కావాల్సిందే

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రియుడిపై కోపంతో ప్రియురాలి అతడి కారును తగలబెట్టింది. ప్రియుడి కారుతో పాటు మరికొన్ని వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖనగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. భరత్ అనే యువకుడు, ఓ యువతి ప్రేమించాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నాడు. గత కొన్ని రోజుల నుంచి భరత్ తన ప్రియురాలును నిర్లక్షం చేస్తుడడంతో అతడిపై ఆమె పగ పెంచుకుంది. ప్రియుడు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో వెళ్లి అతడి కారుపై పెట్రోల్ పోసి తగలబెట్టింది. అతడి కారుతో పాటు 13 వాహనాలు పూర్తిగా దగ్ధంకాగా మరో ఐదు వాహనాలు పాక్షికంగా కాలిపోయాయి. అపార్ట్‌మెంట్ వాసుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్‌మెంట్‌కు కెమెరాలు లేకపోవడంతో ఘటనకు సమీపంలో సిసి టివి ఫుటేజ్‌ను పరిశీలించారు. ఓ యువతి వెళ్తున్నట్టుగా గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తాను చెసినట్టు ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వాహనాలు కాలిపోవడంతో రూ.19 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News