Saturday, January 18, 2025

విద్యార్థినిపై కొడవలితో దాడి చేసిన టీచర్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ట్యూషన్ టీచర్ ఓ విద్యార్థిని ఇంట్లోకి చొరబడి ఆమెపై కొడవలితో దాడి చేయడంతో పాటు అడ్డువచ్చిన ఆమె తల్లిపై కూడా దాడి చేశాడు. ఇంట్లో నుంచి కేకలు వినపడడంతో గ్రామస్థులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉప్పులూరు గ్రామంలో సుబ్రహ్మణం అనే వ్యక్తి(42) తెలుగులో పిజి, పిహెచ్‌డి చేసి స్థానికంగా ట్యూషన్లు చెబుతున్నాడు. తన వద్దకు వచ్చిన పదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సదరు విద్యార్థిని ఇంటర్ విద్యా కోసం మరో ప్రాంతానికి వెళ్లిపోయింది. అతడు జైలుకు వెళ్లినప్పటి నుంచి ఆమెపై అతడు పగపెంచుకున్నాడు. సదరు విద్యార్థిని ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని కొడవలి తీసుకొని ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. విద్యార్థినిపై కొడవలితో దాడి చేసి చంపేయడానికి ప్రయత్నిస్తుండగా తల్లి అడ్డుగా వెళ్లింది. విద్యార్థిని తల్లిపై సుబ్రహ్మణ్యం దాడి చేశాడు. గ్రామస్థులు గమనించి అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సుబ్రహ్మణం కూడా గాయపడడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లీకూతుళ్ల ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News