Sunday, December 22, 2024

ప్రియుడు లేడని యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమించిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో యువతి మనస్తాపానికి గురై ఉరేసుకున్న సంఘటన యానాంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యుకెవి నగర్‌లో తన మేనమామ ఇంటి వద్ద మీసాల మౌనిక(22) ఉంది. పద సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ త్రిమూర్తులు ఇంట్లో తన అక్క, చెల్లితో కలిసి ఉంటుంది. అక్క, చెల్లికి వివాహం కావడంతో తన అత్తింట్లో ఉంటున్నారు. యువతి రాయల్ కాలేజీలో నర్సింగ్ తృతీయ సంవత్సరం చదువుతూ మేనమామ దగ్గర ఉంటుంది.

Also read:ఒవైసీ ముత్తాత బ్రాహ్మణుడా? అసదుద్దీన్ స్పందన ఇది…

గత రెండు సంవత్సరాల నుంచి నిమ్మకాయల చిన్నా, మౌనిక గాఢంగా ప్రేమించుకున్నారు. చిన్నా గంజాయి బానిసగా మారాడు. తల్లిదండ్రులు, సోదరుల వద్ద డబ్బులు అడుక్కొని గంజాయి సేవిస్తూ ఉండేవాడు. ఐదు వందల రూపాయలు సోదరుడు ఇవ్వలేదని చిన్నా ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో మౌనిక తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. చిన్నా లేని జీవితం వృథా అని పలుమార్లు స్నేహితుడు వద్ద బాధపడుతూ ఏడ్చింది. ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మేనమామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News