అమరావతి: ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. వరుసగా రెండో ఏడాది అవార్డులు ప్రదానం చేశారు. విశేష కృషి చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు అవార్డులు ఇచ్చారు. 20 వైఎస్‌ఆర్ జీవిత సాఫల్యత, 10 వైఎస్‌ఆర్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానం, హోంశాఖ మంత్రి తానేటి వనిత, పర్యాటకశాఖ మంత్రి ఆర్ కే రోజా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, సిఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డిజిపి కెవి రాజేంద్రనాథ్ రెడ్డి, ఎపి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ ఎన్ లక్ష్మీపార్వతి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.