Saturday, November 9, 2024

భార్య, ఇద్దరు కుమార్తెలను చంపి ఆంధ్ర టెకీ బెంగళూరులో ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భార్య, ఇద్దరు కుమార్తెలను చంపి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆంధప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాకు చెందిన వీరార్జున విజయ్(31) తన భార్య హేమవతి(29), ఇద్దరు కుమార్తెలు మోక్ష మేఘనయన(2)తోపాటు ఎనిమిది నెలల చిన్నారి సృష్టి సునయనను గొంతుపిసికి చంపిన తర్వాత సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం ఈ ఘటన వెలుగుచూసినప్పటికీ జులై 31వ తేదీ రాత్రి ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

విజయ్ కుటుంబం మూడేళ్ల క్రితం బెంగళూరుకు వచ్చింది. ఆరేళ్ల క్రితం విజయ్‌కు హేమవతితో వివాహమైంది. వైట్‌ఫీల్డ్‌లోని ఐటిపిఎల్‌లో కార్యాలయాలు ఉన్న యూరోఫిన్స్ కంపెనీలో విజయ్ పనిచేస్తుండగా ఆయన భార్య గృహిణి.

ఈ హత్యలు, ఆత్మహత్య వెనుక కారణాలు మిస్టరీగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న హేమవతి తమ్ముడు సాయి ప్రసాద్ బెంగళూరుకు వచ్చిన తర్వాతే ఈ మరణాల విషయం బయటకొచ్చింది. రెండు రోజులుగా తన ఫోన్ కాల్స్‌కు సోదరి నుంచి సమాధానం లేకపోవడంతో అనుమానం వచ్చి సాయి ప్రసాద్ గురువారం ఉదయం సీగెహల్లిలోని సాయి గార్డెన్స్‌లో ఉన్న అక్క ఇంటికి చేరుకున్నాడు.

విల్లాకు లోపల నుంచి తాళం వేసి ఉండడం, ఎపిలిచినా ఎవరూ పలకక పోవడం, లోపల నుంచి దుర్వాసన వస్తుండడంతో అతను ఇరుగుపొరుగవారిని పిలిచాడు. అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా లోపల కుళ్లిపోయిన స్థితిలో నలుగురి మృతదేహాలు కనిపించాయి.

లోపల సూసైడ్ నోట్ లాంటిదేదీ లభించలేదని పోలీసులు తెలిపారు. రెండు మొబైల్ ఫోన్లు, రెండు లాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వైట్‌ఫీల్డ్ డిసిపి ఎస్ గిరీష్ తెలిపారు. విజయ్ తన భార్యను, ఇద్దరు కుమార్తెలను చేత్తో గొంతునులిమి చంపిన తర్వాత సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు క్రైమ్ సీన్‌ను బట్టి అర్థం అవుతోందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News