Saturday, September 21, 2024

నా పై విజిలెన్స్ విచారణ చేపట్టొద్దు: వైవి. సుబ్బారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైకోర్టులో వైవి. సుబ్బారెడ్డి వ్యాజ్యం

అమరావతి:  తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా తీసుకున్న నిర్ణయాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ప్రభుత్వం తనపై చేపట్టనున్న విజిలెన్స్, ఎన్ ఫోర్స్మెంట్ విచారణను రద్దు చేయాలని కోరుతూ వైవి. సుబ్బా రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం విచారణ జరుపనున్నది.

‘‘ నేను తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ కోరారు. నాపై ఆరోపణలు ఏమిటి? అని అడిగితే, అందుకు సంబంధించిన దస్త్రాలు ఇవ్వమని కోరితే స్పందించలేదు. నా వివరణలు లేకుండానే విచారణ పూర్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాల్లో విచారణ జరిపే అధికారం రాష్ట్ర విజిలెన్స్ విభానికి లేదు. టిటిడికి స్వయం ప్రతిపత్తి ఉంది. అంతర్గత విషయాలు విచారించేందుకు టిటిడికి స్వంత విజిలెన్స్ విభాగముంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విచారణ ప్రక్రియను ఆపుతూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి’ అని ఆయన ఆప్ర హైకోర్టును కోరారు. అంతేకాక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, టిటిడి ఈవో, విజిలెన్స్, ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎస్పీలను తన పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News