Sunday, January 19, 2025

పాలపుంత పక్కనే ఆండ్రోమెడా గెలాక్సీ

- Advertisement -
- Advertisement -

నాసా అద్భుతమైన వీడియో
విశ్వంలో ఎన్నో వందల కోట్ల గెలాక్సీలు
వాటిలో మన పాలపుంత (మిల్కీవే) ఒకటి
మనకు అన్నింటికన్నా దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా
దీనిని హబుల్ టెలిస్కోప్‌తో అద్భుతంగా చిత్రీకరించిన నాసా

హూస్టన్ : మన విశ్వం అంటేనే ఎన్నో అద్బుతాలకు పుట్టినిల్లు. వందల కోట్ల గెలాక్సీలు, వేల కోట్ల నక్షత్రాలతో అది అలరారుతోంది. అటువంటి గెలాక్సీల్లో మన భూమి, సౌర కుటుంబం ఉన్న పాలపుంత (మిల్కీవే) ఒకటి. ఇక అంతరిక్షంలో మనకు అన్నింటి కన్నా దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా. ఇవి రెండూ మెల్లగా ఒకదానికి దగ్గరగా వస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని వందల కోట్ల ఏళ్లలో రెండు గెలాక్సీలు ఢీకొని కలసిపోతాయని కూడా చెబుతున్నారు.

మనకు దగ్గరగా ఉండి, భవిష్యత్తులో ఢీకొనబోయే ఆండ్రోమెడా గెలాక్సీపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న ప్రతిష్ఠాత్మర హబుల్ టెలిస్కోప్‌తో ఈ గెలాక్సీని పది సంవత్సరాలుగా చిత్రీకరిస్తూ వచ్చారు. అలా చిత్రీకరించిన చిత్రాలన్నీ కలిపి అత్యంత పెద్ద చిత్రం ఒకదానిని తాజాగా రూపొందించారు. ఏకంగా 250 కోట్ల పిక్సెల్స్‌తో రూపొందిన ఈ చిత్రంలో సుమారు 20 కోట్ల నక్షత్రాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది కూడా ఆ గెలాక్సీలో భాగం మాత్రమేనని వారు చెబుతున్నారు. ఆండ్రోమెడా గెలాక్సీ విషయమై రూపొందించిన అతిపెద్ద చిత్రానికి సంబందించి నాసా ఒక వీడియోను సిద్ధం చేసింది. దానిని నాసా తాజాగా యూట్యూబ్‌లో పెట్టింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News