Thursday, January 16, 2025

అంగన్వాడీ కేంద్రంలో తాడు మెడకు చుట్టుకొని బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెంలో విషాదం చోటుచేసుకుంది. అంగన్వాడీ కేంద్రంలో తాడు మెడకు చుట్టుకొని బాలుడు మృతి చెందాడు. తూకం వేసే ఉయ్యాల తాడు మెడకు చుట్టుకొని బాలుడు చనిపోయాడు. మెడకు తాడు చుట్టుకొని 11 ఏళ్ల బాలుడు చంద్రశేఖర్ మృతి చెందాడు. అంగన్వాడీ టీచర్ సెలవుల్లో ఉండడంతో సహాయకురాలు విధుల్లో ఉన్నారు. పిల్లలను తీసుకొచ్చేందుకు సహాయకరాలు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తలుపులు తీసుకొని వెళ్లి తూకం ఉయ్యాలలోకి బాలుడు ఎక్కాడు. ప్రమాదవశాత్తూ తాడు మెడకు చుట్టుకొని బాలుడు మృతి చెందాడు. కన్నీరుమున్నీరుగా బాలుడి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

Also Read: అది పెద్దగా ఉంటే చాలు.. అలాంటి భర్తే కావాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News