Monday, December 23, 2024

అంగన్ వాడీ సెంటర్ లో పంతులమ్మ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: అంగన్ వాడీ సెంటర్ లో అంగన్ వాడీ కార్యకర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా శావల్యపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మతుకుమల్లి గ్రామంలోని చింతలపాడు బిసి కేంద్రంలో జ్యోతి ప్రసన్న అనే మహిళ అంగన్ వాడీ కార్యకర్తగా పని చేస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఎపిలో అంగన్ వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు.

సమ్మెను విరమించిన తరువాత బుధవారం ఆమె అంగన్ వాడీ కేంద్రానికి చేరుకొని పిల్లలకు పౌష్టికాహారం అందించారు. సాయంత్రం నాలుగు గంటల తరువాత చిన్నారులను, సహాయకురాలిని ఇంటికి వెళ్లాలని సూచించారు. తనకు రికార్డులు రాసే పని ఉందని చెప్పారు. రాత్రి 7.30 వరకు ఇంటికి రాకపోవడంతో పిల్లలు, బంధువులు అంగన్ వాడీ కేంద్రం వద్దకు వెళ్లి చూడగా ఆమె ఉరేసుకున్నట్టు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News